Skip to main content

ధర్మ రక్షణ


ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనది హిందూ మతం. 
హిందూ దేవాలయాలు ఎన్నో శతాబ్దాలుగా నిరంతరాయంగా మానవాళికి వెలుగునందిస్తున్నాయి.

ఆ దేవాలయాల వాకిళ్లు ఈ రోజు భక్తుల సందడి లేక బోసి పోతున్నాయి. చరిత్రలో ఇంతటి విపత్కర పరిణామం ఎన్నడూ చోటు చేసుకోలేదు.

భక్తులు రాక, ఆదాయం లేక దేవాలయంలోని పూజారులకు కనీస ఆదాయం లభించడం గగనం అయిపోతున్నది. చిన్న, చిన్న ఆలయాలలోని పూజారులు, ఆలయాల బయట పూజలు చేసే అర్చకులు అవస్థలు పడడం సమాజానికి శుభప్రదం కాబోదు.

ఇట్టి పురోహితుల సంక్షేమం కోసం సమాజం ధన రూపేణా సహాయం చేసేందుకు ముందుకు రావలసిన అవసరం ఉన్నది. అర్హులైన పూజారులను గుర్తించి, క్లిష్ట సమయం గడిచేంత వరకు వారికి అవసరమైన ధన సహాయం అందించేందుకు ఈ ప్రయత్నం.  

ఒక జ్ఞానికి సహాయం అందించడం .. ఒక ఆలయం నిర్మించడంతో సమానం.”

ఇందుకు సిద్ధ పడిన దాతలు తమ పేరు నమోదు చేసుకోగలరు, వారికి మా వద్ద ఉన్న అర్చకుల పేర్లు పంపించడం జరుగుతుంది. వారు నేరుగా అర్చకుని బ్యాంక్ ఎకౌంట్ కి ధనం జమ చేయవచ్చు

మీ వీలునుబట్టి ఒక్కరు లేక అంతకుమించి అర్చకులకు సహాయం అందించవచ్చు. సాయం స్వీకరించిన పురోహితులు మీకు ఆశీస్సులు ఫోన్ ద్వారా అందజేస్తారు.  

దాతలు తమ పేరు నమోదు చేసుకోవడానికి ఈ క్రింది నెంబర్ కు వాట్స్అప్ లేదా ఎస్ ఎం ఎస్ పంపగలరు:           7382 337 301; 9247 159 343


- ఫణి కుమార్, IAS (Retd.),
గోపాల రావు (ప్రజా ఆలోచన వేదిక),                                                         
వెంకటేశ్వర ఆచార్యులు, శ్రీనివాస్ మాధవ్                                 
 హైదరాబాద్   
 30 మార్చి 2020, సోమవారం     

 ధర్మో రక్షతి రక్షితః 

                 https://dharmacovid.blogspot.com/

Comments

  1. అద్భుతమైన అలోచన,మంచి ప్రయత్నం సర్..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog