- Get link
- X
- Other Apps
ధర్మ రక్షణ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనది హిందూ మతం. హిందూ దేవాలయాలు ఎన్నో శతాబ్దాలుగా నిరంతరాయంగా మానవాళికి వెలుగునందిస్తున్నాయి. ఆ దేవాలయాల వాకిళ్లు ఈ రోజు భక్తుల సందడి లేక బోసి పోతున్నాయి. చరిత్రలో ఇంతటి విపత్కర పరిణామం ఎన్నడూ చోటు చేసుకోలేదు. భక్తులు రాక , ఆదాయం లేక దేవాలయంలోని పూజారులకు కనీస ఆదాయం లభించడం గగనం అయిపోతున్నది. చిన్న , చిన్న ఆలయాలలోని పూజారులు , ఆలయాల బయట పూజలు చేసే అర్చకులు అవస్థలు పడడం సమాజానికి శుభప్రదం కాబోదు. ఇట్టి పురోహితుల సంక్షేమం కోసం సమాజం ధన రూపేణా సహాయం చేసేందుకు ముందుకు రావలసిన అవసరం ఉన్నది . అర్హులైన పూజారులను గుర్తించి , క్లిష్ట సమయం గడిచేంత వరకు వారికి అవసరమైన ధన సహాయం అందించేందుకు ఈ ప్రయత్నం. “ ఒక జ్ఞానికి సహాయం అందించడం .. ఒక ఆలయం నిర్మించడంతో సమానం .” ఇందుకు సిద్ధ పడిన దాతలు తమ పేరు నమోదు చేసుకోగలరు , వారికి మా వద్ద ఉన్న అర్చకుల పేర్లు పంపించడం జరుగుతుంది . వారు నేరుగా అర్చకుని బ్యాంక్ ఎకౌంట్ కి ధనం జమ చేయవచ్చు . మీ వీలునుబట్టి ఒక్కరు లేక అంతకుమించి అర్చకులకు సహాయం అందించవచ్చు . సాయం స్వీకర...
Comments
Post a Comment